మేక్ మై ట్రిప్ ఆధ్వర్యంలో విమెన్ హోమ్ స్టే ఓనర్స్ కు సాధికారత

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళా ఔత్సాహికత మరియు స్వావలంబనను మద్దతు చేసే లక్ష్యం కలిగిన చొరవలో భాగంగా నీతి ఆయోగ్ కింద ప్రోత్సహించబడిన విమెన్ ఎంట్రిప్రిన్యుర్ షిప్ ప్లాట్ ఫాం (డబ్ల్యూఈపీ) మేక్ మైట్రిప్ సహకారంతో ప్రాజెక్ట్ మైత్రి  ఆరంభాన్ని ప్రకటించింది. ఔత్సాహికత, ఆర్థిక సాధికారత మరియు స్వాతంత్ర్యాలకు ఒక మార్గంగా వినియోగించబడని హోమ్ స్టేస్ సామర్థ్యాన్ని వెలికితీసే ఈ విలక్షణమైన ప్రయత్నం దేశంలోని ఈశాన్య ప్రాంతంలో మహిళలు పై దృష్టి కేంద్రీకరించింది. ఇటానగర్ లో డోర్జి ఖండు రాష్ట్ర కన్వెన్షన్ సెంటర్ లో ‘ఎనేబ్లింగ్ విమెన్లెడ్ డెవలప్ మెంట్ ఇన్ అరుణాచల్’ (అరుణాచల్‌ మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రారంభించడం) శీర్షికతో ప్రారంభించబడిన ఈ కార్యక్రమానికి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పిమ ఖండు హాజరై, లింగ సమతుల్యత ప్రగతికి రాష్ట్ర నిబద్ధతను తెలియచేసారు. ప్రాజెక్ట్ మైత్రి ఆధునిక ఆలోచనలు కలిగిన చొరవ. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో హోమ్ స్టే ఓనర్స్ కు సాధికారత కల్పించి, ప్రేరేపించడానికి రూపొందించబడింది. ప్రాజెక్ట్ లో భాగంగా, ఎంపికైన పార్టిసిపెంట్స్ తమ విలక్షణమైన వ్యాపార అవసరాలకు రూపొందించబడిన ప్రత్యేకమైన శిక్షణ అందుకుంటారు. ఈ శిక్షణ ఆతిధ్యం, భద్రత, డిజిటల్ మార్కెటింగ్, అనుసరణ సహా విస్తృత శ్రేణి నైపుణ్యాలు అందచేస్తుంది. అదనంగా, ప్రముఖ ముగ్గురు హోమ్ స్టే ఓనర్స్ ను బహుమతులతో గుర్తిస్తారు మరియు ఈ రంగంలో ఆవిష్కరణ మరియ శ్రేష్టతలను మరింత ప్రోత్సహిస్తారు.
పురోగతి గురించి మాట్లాడుతూ, శ్రీమతి అన్నా రాయ్, మిషన్ డైరక్టర్, డబ్ల్యూఈపీ ఇలా అన్నారు, మహిళల ఔత్సాహికతను శక్తివంతం చేయడానికి, లింగ సమానత్వం మరియు ఆర్థికాభివృద్ధితో అనుసంధానం చేసే ఒక వ్యూహాత్మక విధానానికి ప్రాజెక్ట్ ప్రతీకగా నిలిచింది. ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోరుకునే మహిళలు కోసం ఒక ఆకర్షణీయమైన మరియు ఆచరణసాధ్యమైన వ్యాపార మార్గంగా భారతదేశంలో హోమ్ స్టేస్ అభివృద్ధి చెందగలవు కాబట్టి దీనికి దీర్ఘకాలిక లాభాలను అందించే సామర్థ్యం ఉంది.”
రాజేష్ మాగో, సహస్థాపకులు మరియు గ్రూప్ సీఈఓ, మేక్ మై ట్రిప్ ఇలా అన్నారు, మేము ప్రయాణం యొక్క పరివర్తన శక్తిని విశ్వసిస్తాం మరియు ఈ ప్రాజెక్ట్ ద్వారా, మేము విమెన్ హోమ్ స్టే ఓనర్స్ కోసం ఈ శక్తిని వినియోగించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా విమెన్ ఎంట్రిప్రిన్యుర్ షిప్ ప్లాట్ ఫాంతో భాగస్వామ్యం చెందడానికి గర్విస్తున్నాం మరియు  మహిళా ఔత్సాహికులు భారతదేశపు పర్యటక పరిశ్రమ యొక్క చురుకుదనం, విలక్షణతకు తోడ్పడుతూ వర్థిల్లడం కోసం  ఎదురుచూస్తున్నాం.” నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రోత్సహించబడిన డబ్ల్యూఈపీ, ఇప్పుడు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంగా పరివర్తనం చెంది మహిళా ఔత్సాహికులకు సంబంధించిన సమాచారం, సేవలు కోసం అంతిమ పరిష్కారంగా ప్రభుత్వ పథకాలు మరియు ప్రైవేట్ రంగం చొరవలు కోసం స్మార్ట్ మ్యాచ్ ఆధారిత ప్లాట్ ఫాంగా, విజ్ఞానానికి ఆధారంగా, కమ్యూనిటీ ప్లాట్ ఫాంగా, విస్తృత శ్రేణి వ్యవస్థలు అందిస్తోంది, సామర్థ్య రూపకల్పన, మార్గదర్శకత్వం అందిస్తోంది. తన మేక్ మైట్రిప్ వంటి  పరిశ్రమ నాయకునితో తన సహకారం ద్వారా, డబ్ల్యూఈపీ మహిళా ఔత్సాహిక విజయానికి అనుకూలమైన వ్యవస్థను సృష్టించే ప్రయత్నాలను వ్యాప్తి చేస్తోంది. ఈ పరివర్తనా కార్యక్రమం కోసం దరఖాస్తులు డిసెబంర్ 13, 2023న డబ్ల్యూఈపీ వెబ్ సైట్ పై అందుబాటులో ఉంటాయి.