జాతీయ స్థాయిలో సత్తా చాటాలి

జాతీయ స్థాయిలో సత్తా చాటాలి– చాలెంజర్‌ ట్రోఫీకి ఎంపికైన క్రికెటర్లకు జగన్‌ అభినందన
హైదరాబాద్‌ : దేశవాళీ అండర్‌-19 వన్డే చాలెంజర్‌ ట్రోఫీలో రాణించి సత్తా చాటాలని హైదరాబాద్‌ యువ క్రికెటర్లతో హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు అన్నారు. హెచ్‌సీఏ డివిజన్‌ లీగ్‌ల్లో ప్రతిభ చాటి దేశవాళీ జట్లకు ఎంపికైన మన కుర్రాళ్లను బుధవారం ఆయన అభినందించారు. నవంబర్‌ 3 నుంచి బీసీసీఐ అండర్‌-19 చాలెంజర్‌ ట్రోఫీ ఆరంభం కానుంది. ఇందులో భారత్‌-ఏ, బి, సి, డి జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీకి హైదరాబాద్‌ నుంచి ధీరజ్‌ గౌడ్‌, మురుగున్‌ అభిషేక్‌, నిశాంత్‌ ఎస్‌, అరవెళ్లి అవినాశ్‌ రావులు ఎంపికయ్యారు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో 19 వికెట్లతో సత్తా చాటిన టి. రవితేజ, సీనియర్‌ ఉమెన్స్‌ టోర్నీలో 15 వికెట్లతో రాణించిన భోని శ్రావణి ఇదే జోరు రానున్న టోర్నీల్లో కొనసాగించాలని జగన్‌మోహన్‌ రావు ఆకాంక్షించారు.