– దేశంలో తొలి ఆటో రోబోటిక్ కేంద్రం
హైదరాబాద్: అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఎన్‌కోర్-ఆల్కమ్ గుజరాత్‌లోని సూరత్ వద్ద 1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ప్లాంటు నెలకొల్పుతోన్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంటు కోసం కంపెనీ సుమారు రూ.60 కోట్లు వెచ్చిస్తోన్నట్లు వెల్లడించింది. అల్యూమినియం డోర్స్, విండోస్ విభాగంలో భారత్‌లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ ఇదేనని ఎన్‌కోర్-ఆల్కమ్ ఫౌండర్, సిఎండి అవుతు శివ కోటి రెడ్డి తెలిపారు. జర్మనీ సాంకేతికతతో రోజుకు 30వేల చదరపు అడుగుల తయారీ సామర్థ్యంతో మార్చికల్లా ఈ కేంద్రం అందుబాటులోకి రానుందన్నారు. పోటీ కంపెనీలతో పోలిస్తే తమ ఉత్పత్తులు 300 శాతం మెరుగ్గా ఉంటాయన్నారు. తమకు 60 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో జనవరి 19 నుంచి జరిగే ఏస్‌టెక్ ట్రేడ్ ఫెయిర్‌లో వినూత్న ఉత్తత్తులను ప్రదర్శిస్తామని ఆల్కమ్ డైరెక్టర్ జయంతి భారు మనుభారు తెలిపారు.