రూ.60 కోట్లతో ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ ప్లాంట్‌

Encore-Alcom plant at a cost of Rs.60 crores– హైటెక్స్‌లో వినూత్న ఉత్పత్తుల ప్రదర్శన
– ఫౌండర్‌ అవుతు శివ కోటి రెడ్డి వెల్లడి
నవ తెలంగాణ – హైదరాబాద్‌
అల్యూమినియం డోర్స్‌, విండోస్‌ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్‌ సంస్థ ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ సూరత్‌లో నెలకొల్పిన అత్యాధునిక కొత్త ప్లాంటులో కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపింది. 1,84,000 చదరపు అడు గుల విస్తీర్ణంలో దీన్ని అందుబాటు లోకి తెచ్చినట్లు ఎన్‌కోర్‌ ఉడ్‌క్రాఫ్ట్స్‌ ఫౌండర్‌, సిఎండి శివ కోటి రెడ్డి తెలిపారు. ఈ రంగంలో దేశంలోనే ఇది తొలి ఆటో రోబోటిక్‌ ఫెసిలిటీ అన్నారు. ఈ ప్లాంటుకు దశలవారీగా రూ.60 కోట్ల పెట్టుబడుల వ్యయం చేయనున్నామ న్నారు. ”హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జనవరి 24 నుంచి జరిగే ఏస్‌టెక్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లో అత్యాధునిక, వినూత్న ఉత్తత్తులను ప్రదర్శించాము. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, దుబారు, ఈయూలో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి సత్తా చాటాం. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ధీటుగా సొంత ఆర్‌అండ్‌డీతో, ఇటలీ డిజైనర్ల సహకారంతో ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. 3,500లకుపైగా ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో త్వరలో అడుగుపెట్టనున్నాం.’ అని కోటి రెడ్డి తెలిపారు. ఎత్తు, వెడల్పు పరంగా ఎన్‌కోర్‌ – ఆల్కమ్‌ తయారు చేసిన 20 అడుగుల స్లైడింగ్‌ డోర్‌ భారత్‌లో అతిపెద్దదని ఆల్కమ్‌ డైరెక్టర్‌ జయంతి భారు పటోలా తెలిపారు.