– మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
నవతెలంగాణ-నస్పూర్
ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్-2024 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజా ఉపయోగకరమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) సబావత్ మోతిలాల్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, సైన్స్ అధికారి మధుబాబు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో కలిసి 6వ ఎడిషన్- ఇంటింటా ఇన్నోవేటర్-2024 పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అద్భుతమైన ఆలోచనలు, ప్రాజెక్టులు రూపొందించిన అన్ని వర్గాల ఆవిష్కర్తల నుంచి ఆవిష్కరణలను స్వీకరించడం జరుగుతుందని, గొప్ప ఆవిష్కరణలను ఎంపిక చేసి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంబంధిత ఆవిష్కర్తలకు అవార్డు ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు ఒకరు చొప్పున యువ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించి ఇన్నోవేషన్ మిత్రలుగా, 3 నెలల కాలానికి సమన్వయకర్తలుగా పనిచేసి జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంస్థలు, గ్రామీణ ప్రజలతో సహా విభిన్న వాటాదారులతో నిమగమై మారుమూల గ్రామాలకు కూడా ఆవిష్కరణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ నూతన ఆవిష్కరణలను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. ఆవిష్కర్తలు దరఖాస్తులను నేరుగా వాట్సాప్ ద్వారా 9100678543 పంపించవచ్చని, దరఖాస్తులో ఆవిష్కర్త పేరు, వయసు, ఫోటో, వత్తి, చిరునామా, ఆవిష్కరణ పేరు, 100 పదాలతో ఆవిష్కరణ వివరణ, ఆవిష్కరణ సంబంధిత హై రిజల్యూషన్ కలిగిన 4 ఫోటోలు, ఆవిష్కరణ విధులను ప్రదర్శించే 2 వీడియోలు ఆగస్టు 3 తేదీలోగా పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) సబావత్ మోతిలాల్, సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థిని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవరాశి మనుగడ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమత్యులతను కాపాడటంలలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, భావితరాలకు కాలుష్యం లేని స్వచ్ఛమైన సహజ వాయువు అందించాలని అన్నారు.