కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ను నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా ఆయన లాంచ్ చేయబోతున్నారు. దీని గురించి దిల్‌రాజు మాట్లాడుతూ, ‘కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఈ దిల్ రాజు డ్రీమ్స్‌ను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు ఇలా ఎవ్వరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు, కంటెంట్ ఉన్న వాళ్లు మా టీమ్‌ని అప్రోచ్ అవ్వొచ్చు. మా వెబ్ సైట్ ద్వారా మీ కంటెంట్ మా టీమ్‌కు చేరుతుంది. వారంలో ఒక రోజు ఈ టీమ్ తెచ్చిన స్క్రిప్ట్‌లను నేను వింటాను. నా బర్త్ డే సందర్భంగా లేదా న్యూయర్ సందర్భంగా ఈ కొత్త వెబ్ సైట్‌ను లాంచ్ చేస్తాం. నాకు సన్నిహితులైన స్టార్ హీరోలను, దర్శకులందరినీ పిలిచి ఆ వెబ్ సైట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తాం. ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. కొత్త వాళ్లందరికీ ఇదొక ఫ్లాట్ ఫామ్‌గా ఉండాలనేది మా లక్ష్యం’ అని తెలిపారు.