పాఠశాల రుణం…విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తున్న

School Loan...Giving encouragement to students– పూర్వ విద్యార్థి ఉదయ్ భాస్కర్ రావుకు ఘన సన్మానం
– తాజా మాజీ ఎంపిపి మలహల్ రావు, హెడ్ మాస్టర్ భాస్కర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 1980-81వ బ్యాచ్ 7వ తరగతి విద్యాభ్యాసం చేపట్టిన ఇదే గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి  ఉదయ్ భాస్కర్ రావు ఉన్న ఉరు కన్నతల్లిలా తాను చదువుకున్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహనికి మంగళవారం పాఠశాలలో తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావు,పెర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు పమ్మిడి సాగర్ రావు శాలువాలతో ఘనంగా  సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపిపి, హెడ్ మాస్టర్ భాస్కర్ రావు మాట్లాడారు ఉదయ్ భాస్కర్ రావు గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పాఠశాలలో పదోవ తరగతి చదువుతున్నవారు 10/10జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.5వేలు, సెకండ్ సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరి రూ.2500 చొప్పున నగదు అందజేస్తూ విద్యార్థులను ప్రోత్సహిoచడం జరుగుతుందన్నారు.అలాగే పాఠశాలలో రూ.60 వేలు ఖర్చు పెట్టి పాఠశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం, రూ.1లక్ష ఖర్చు పెట్టి జనవరి నెలలో విద్యార్థులకు పోగ్రామ్ చేసుకోవడానికి స్టేజ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని ఇందుకు ఉదయ్ భాస్కర్ రావు కు మనస్పూర్తిగా అభినందించి,ఘనంగా సత్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మీ నారాయణ,విద్యార్థులు పాల్గొన్నారు.