మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న చెరువుల భూముల హద్దులను గుర్తించి”సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే గతంలో చెరువు భూములు కబ్జా అయితే వాటిని గుర్తించి భూములను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్, ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన పత్రిక విలేకరులతో వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో చెరువులు కబ్జాకు గురయ్యాయి అన్నారు. వాటిని రెవెన్యూ అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకోవాలన్నారు. హైదరాబాదులో అక్రమాలపై హైడ్రా నిర్వహిస్తున్న చర్యల మాదిరిగా, జన్నారంలో కూడా అధికారులు సర్వేలు నిర్వహించి వెంటనే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. అనంతరం తాసిల్దార్ రాజ వర్ధన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.