ఏఎస్‌ఓల ఫౌండేషన్‌ శిక్షణా పర్యటన ముగింపు

నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
కేంద్ర సెక్రటేరియట్‌ సర్వీస్‌ 2022 బ్యాచ్‌ సహాయ సెక్షన్‌ అధికారుల ఎంసిఅర్హెచ్‌అర్డి లో ఫౌండేషన్‌ కోర్స్‌ శిక్షణ లో బాగంగా నల్గొండ జిల్లా లో ఈ నెల 16 నుండి 20 వరకు 5 రోజులు పర్యటన ముగిసింది.శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం లో సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ లో పని చేస్తున్న 25 మంది సహాయ సెక్షన్‌ అధికారులు జిల్లాలో పర్యటన ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్‌ అర్వి.కర్ణన్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ లతో సమావేశ మయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ లో అక్టోబర్‌ 3 నుండి డిసెంబర్‌ 1 వరకు ఫౌండేషన్‌ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు విచ్చేసిన 25 మంది ఏఎస్‌ఓ లు జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న అభివద్ది కార్యక్రమాలు పరిశీలించారు. ఈ బృందం నల్గొండ మండలం అనేపర్తి, మిర్యాలగూడ మండలం శ్రీనివాస నగర్‌,దామరచర్ల మండలం వాడ పల్లి,చిట్యాల మండలం ఉరుమడ్ల, మును గోడ్‌ మండలం పలి వెల గ్రామాల్లో 5 రోజులు శిక్షణా లో బాగంగా పర్యటించారు.గ్రామాల్లో పల్లె ప్రకతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామం లు,దళిత బంధు, గొర్రెల పంపిణీ, ఉపాధి హామీ పథకాలు అమలు పరిశీలించారు. ఈ బృందం లో 25 మంది సభ్యులు 5 గురు చొప్పున 5 గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో సాంఘిక,ఆర్థిక పరిస్థితులు,గ్రామాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భూమి లేని పేద లు, కూలీ లు ఎదురు కొంటున్న పరిస్థితులు, సమస్యలు,అభివద్ది, సంక్షేమ కార్యక్రమాలు,జీవన స్థిితి గతులలో మార్పులు వారు అధ్యయనం చేశారు.వీరితో పాటు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం లోని ప్రాంతీయ శిక్షణా కేంద్రం మేనేజర్‌ పి.వెంకటేశ్వర్లు ఉన్నారు.
మిర్యాలగూడ : కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రి త్వ శాఖలలో నూత నంగా నియ మింప బడ్డ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు మిర్యాల గూడ మండ లంలో అధ్యయ నాన్ని శుక్రవారం పూర్తి చేశారు. గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పధకాల అమలుపై మిర్యాలగూడ మండలంలో 4రోజుల అధ్యయనాన్ని పూర్తి చేసుకున్న అనంతరం ఐదుగురు సభ్యులు రిశబ్‌ దహారియ, హార్దక్‌ ముఖర్జీ, దిలీప్‌ కుమార్‌, అభరు రాజ్‌ సక్సేనాలను ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, సర్పంచ్‌ బి. వెంకటరమణ చౌధరీ, ఎంపిఓ టీ. వీరారెడ్డిలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిత తదితరులు పాల్గొన్నారు.