ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ముగింపు

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని దుర్గనాగర్ తండా గ్రామంలో  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ అధ్వర్యంలో  ఏర్పాటుచేసిన శీతకాల శిబిరం సోమవారము ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారిని డా. సరిత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామంలో మహిళా దినోత్సవం ఏర్పాటు చేసి మహిళల యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ, ఆటల పోటీలు నిర్వహించి విజేతలు అయినటువంటి గ్రామ  మహిళలకు సన్మానం చేసి బహుమతులతో వారిని సత్కరించామన్నరు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కే లావణ్య అధ్యక్షత వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వాలంటీర్స్ చేసిన సేవలను కొనియాడారు. గ్రామాల్లో పరిశుభ్రతను పాటించడము వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, తద్వారా అంటురోగాలు ప్రబలకుండా ఉంటాయని  తెలిపారు. పంచాయతీ కార్యదర్శి స్వాతి, గ్రామ ప్రజలు వాలంటీర్స్ తమ గ్రామంలో చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలను గ్రామస్తులకు వివరించినందుకు  వాలంటీర్స్ ని ఎంతగానో కొనియాడారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్,  వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ పద్మమ్మ, వాలంటీర్స్ కి సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఎన్ఎస్ఎస్ మెంబర్స్ డి. సుమలత, పి. శ్వేత పాల్గొన్నారు.