మండలంలోని ఉప్పల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గత నెల రోజులుగా ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు పోలో బోయిన సత్యం మాట్లాడుతూ, విద్యార్థులు యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, తద్వారారోగ్యవంతమైనటువంటి శరీరాన్ని, మనసును కలిగి ఉండే అవకాశం ఉంటుందని, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు, తెలివితేటలు వృద్ధి చెందుతాయని విద్యార్థులు అందరూ యోగాను క్రమం తప్పకుండా సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి రాజనర్సింహారెడ్డి, రోటరీ కోశాధికారి తోరణాల సుధాకర్, సభ్యులు గడ్డం గంగారెడ్డి, వై. శంకర్, నాగభూషణం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిట్టూరి ఆనందరావు. యోగా గురువు బండి రాములు ను ఘనంగా సన్మానించరు. కమిటీ చైర్మన్ భాగ్య, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. తదనంతరం యోగా గురువు బండి రాములుని ఘనంగా సన్మానించడం జరిగింది.