ఎండ భగ భగ.. కరీంనగర్  వీక్లీ మార్కెట్  వెల వెల 

– బేరాలు లేక వ్యాపారుల విల విల
– ఎండ తీవ్రత కు నిర్మానుష్యంగా మారిన రోడ్లు
నవతెలంగాణ – భగత్ నగర్
కరీంనగర్ వీక్లీ మార్కెట్.. జిల్లాలోని వివిధ ప్రాంతాల కు చెందిన వ్యాపారులు,కొనుగోలుదారులు లావాదేవీలు జరిగే ప్రాంతం. కూరగాయలు,చేనేత వస్త్రాలు  ఇలా ఒకటేమిటి .. వినియోగదారుల ,వ్యాపారుల స్వర్గ ధామం ఇలాంటి వార సంత  నిర్మానుష్యంగా మారింది.   భానుడి భగ భగలకు  భయపడి  కొనుగోలు దారులు రాకపోవడం తో పలు చిరు వ్యాపారాలు వెల వెల బోయాయి. అవసరమైతే తప్ప ప్రజలు రోడ్ల మీదికి రాకపోవడం తో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.