
నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీలు శనివారం ముగిసినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. క్రికెట్, చెస్, క్యారమ్స్, షెటిల్, న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య స్నేహపూర్వకంగా జరిగినట్లు తెలిపారు. శనివారం నిజామాబాద్ నగరంలోని నాగారం స్టేడియంలో న్యాయమూర్థులు, న్యాయవాదుల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో న్యాయమూర్తుల జట్టు మొదట బ్యాటింగ్ చేసి మొత్తం పది ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యాయవాదుల జట్టు 92 పరిగులు చేసి ఓటమిపాలుఅయింది. విజేతలకు రిపబ్లికన్ డే న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్యఅతిథిగా పాల్గొనే కార్యక్రమంలో బహుమతుల ప్రధానం జరుగుతుందని జగన్ గౌడ్ అన్నారు.