ముగిసిన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి గ్రామ శివారులో గల ఇందూరు తిరుమల క్షేత్రంలో గతఏడురోజులపాటుఅంగరంగవైభవంగాజరిగినఇందూరు తిరుమలబ్రహ్మోత్సవాలుచివరిరోజుఅయిన శుక్రవారంమూలవిరాటు ఉత్సవానంతరం స్నాపన సేవతో బ్రహ్మోత్సవాలను ముగించారు. యజ్ఞాచార్యులు అర్చక స్వాములు వేద పండితులు 108 కళశాల్లో అభిషేక గంగను తీసుకొచ్చి స్వామి వారికి ఉత్సవానంతర అభిషేకం చేసి బ్రహ్మోత్సవాలను ముగించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనములతో శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవానాథ జీయరు స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆచార్య గంగోత్రి రామానుజ దాస్ స్వామి వారి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు అద్భుతంగా పరిపూర్ణం అయ్యాయి అని ఆలయ ధర్మకర్త శ్రీ నరసింహ రెడ్డి అన్నారు. గ్రామ ప్రజల సహకారం మరువలేనిది అని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో నర్సింగ్ పల్లి గ్రామస్తులతో పాటు జిల్లా నలు మూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి అని అన్నారు. ఇందూరు తిరుమల క్షేేేత్రo  వెలసిన నర్సింగ్ పల్లి గ్రామం జిల్లా నలుమూూలలతో పాటు రాష్ట్రంలో కూడా ఈ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని వారు తెలిపారు .అలాగే ప్రతి ఏడు ఇంతకు మించిన ఉత్సాహంతో ఇంకా ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని నరసింహ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి దంపతులు, విజయసింహా రెడ్డి దంపతులు, సుదర్శన్ రెడ్డి దంపతులు,  రవీందర్ యాదవ్, నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, రమేష్, భాస్కర్, నరేందర్, మురళి, సురేశ్, సాయిలు, యాజ్ఞాచార్యులు సత్యన్నారాయణాచార్యులు,, రోహిత్ కుమారాచార్యులు, శ్రీకర్ కుమారాచార్యులు విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.