అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేల్ ఉత్సవ్ 2025 క్రీడా పోటీలు ముగిసాయి. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం వర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు పాల్గొని మాట్లాడుతూ దేశంలో యువత రోజురోజుకు మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిసై ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోతున్నా రన్నారు. విద్యార్థులు సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని యువతకు సూచించారు. వివేకనంద భారత సంస్కృతిని ప్రపంచ దేశాలకు చేరవేసిన మొట్టమొదటి వ్యక్తి అన్నారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్లను ఆదర్శంగా విద్యార్థిలోకమంతా తీసుకొని వివేకానందుడిలా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వ గురు స్థానంలో ఉంచాలని పేర్కొన్నారు. చంద్రబోస్ లాగా దేశం కోసం ఆలోచించి విద్యార్థులంతా దేశ వ్యతిరేక శక్తులకు బుద్ధి చెప్పాలని అన్నారు.విద్యార్థులంతా మత్తు పదార్థాలను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు కోసం ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.కార్యక్రమానికి అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ సంపత్ పాల్గొని మాట్లాడుతూ .. విద్యార్థులంతా మొబైల్ ఫోన్లను వదిలేసి మైదానంలోకి వచ్చి క్రీడల్లో పాల్గొని శారీరకంగా మనసికంగా పటిష్టంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులంతా మొబైల్ వాడకంలో అలవాటైపోయి భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు.కార్యక్రమంలో అతిథిగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు,ఇందూరు విభాగ్ రేంజర్ల నరేష్ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన మహనీయులు స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి గొప్ప వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థి పరిషత్ పనిచేస్తుందని అన్నారు.అనంతరం క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి శివ,రాష్ట్ర కార్య సమితి సభ్యులు అమృత చారి,యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్,స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ మోహన్,యూనివర్సిటీ నాయకులు సమీర్, అక్షయ్, నవీన్, అజయ్, అనిల్, నరేందర్,నాగరాజు, సచిన్, సాయి, రాము, సునీల్ విద్యార్థులు పాల్గొన్నారు.