– సెయిలర్ గోవర్థన్ ట్రిపుల్ ధమాకా
నవతెలంగాణ-హైదరాబాద్ : 15వ మాన్‌సూన్ రెగట్టా చాంపియన్‌షిప్ విజయవంతంగా ముగిసింది. పోటీల చివరి రోజు వర్షం చినుకుల నడుమ సెయిలర్లు హుస్సేన్‌సాగర్‌లో పోటీపడ్డారు. ఆరంభం నుంచి ఆధిక్యంలో కొనసాగిన తెలంగాణ సెయిలర్ గోవర్థన్ పుల్లార, కొమరవెల్లి దీక్షితలు బాలురు, బాలికల విభాగంలో పతకాలు సాధించారు. అండర్-16 ఆప్టిమిస్ట్ బాలురు, బాలికల విభాగంలో గోవర్థన్, దీక్షిత బంగారు పతకాలు దక్కించుకున్నారు. మాన్‌సూన్ రెగట్టా టైటిల్, అత్యంత నిలకడగా రాణించిన సెయిలర్‌గా ఎస్‌హెచ్ బాబు ట్రోఫీ సహా బాలుర విభాగంలో పసిడితో అరుదైన ట్రిపుల్ ధమాకా ఘనత సాధించాడు. బాలుర విభాగంలో ఆకాశ్ (మైసూర్), మహ్మద్ రిజ్వాన్ (తెలంగాణ) రజత, కాంస్య పతకాలు సాధించారు. బాలికల విభాగంలో శ్రేయ కృష్ణ (తమిళనాడు), షగున్ ఝా (మధ్యప్రదేశ్) సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందుకున్నారు.