ముగిసిన ప్రజాపాలన గ్రామసభలు..

– దరఖాస్తులు ఆన్లైన్ ప్రారంభం…

నవతెలంగాణ – అశ్వారావుపేట
వారం రోజులు పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ పరిపాలన గ్రామసభలు శనివారంతో ముగిసాయి.మండలంలో 17265 గృహాలు నుండి 17910 కుటుంబాలు అందజేసిన దరఖాస్తులను 123 కౌంటర్ ల ద్వారా స్వీకరించారు.తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏవో నవీన్, ఐబీ ఏఈ కేఎన్బీ క్రిష్ణ, ఎం పీ ఈ ఓ సీతారామరాజు బృంద నేతలుగా ఒక్క బృందంలో 7 గురు సభ్యులు ఈ దరఖాస్తు స్వీకరణ కోసం పాటుపడ్డారు. ప్రజా పాలన ముగింపు రోజున ఉండే ప్రజలు అందజేసిన దరఖాస్తులను ప్రజాపాలన ప్రభుత్వ వెబ్ సైట్ ఆన్ లైన్ నమోదు ప్రక్రియను నమోదు చేస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ఈ జీ ఎస్ కార్యాలయంలో  15 కంప్యూటర్ లు ద్వారా 30 మంది ఆపరేటర్ లు నిర్విరామ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.