– త్రాగునీరు సరఫరా పై అధికారుల పర్యవేక్షణ కరువు
నవతెలంగాణ – అచ్చంపేట
రూరల్ సప్లై వాటర్ శానిటేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు పరిపాలన విధానం పైన నిర్లక్ష్యం చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన వాటర్ ట్యాంకులను కనీసం 15 రోజులకోసారి కూడా శుభ్రం చేయడం లేదు. కొన్ని పల్లెల్లో వాటర్ ట్యాంకులు పగుళ్లు వచ్చి నీరు లీకేజ్ అవుతున్నాయి. ఈ సమస్య అధిక దాదాపు అన్ని గ్రామాల్లో కనిపిస్తుంది. ఇప్పటికే వేసవి ప్రభావితం కనబడుతుంది. నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళికలు రూపొందించడంలో విఫలమయ్యారు. మిషన్ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. దీనివల్ల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయ్యింది. అధికారులు ,రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు లబ్ది పొందారని ప్రజలు చర్చించుకుంటున్నారు.