
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఈనెల 16 నుండి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి మడికొండ రత్నాకర్ పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటినుండి ప్రభుత్వ కార్యాలయాల ముందు ఏర్పాటుచేసిన రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను మల్టీపర్పస్ సిబ్బందితో తొలగించారు. ఇటీవల భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించిన శిలాఫలకాలకు బ్లాక్ కవర్ తో కప్పివేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ఉన్న సిపిఐ స్థూపానికి మల్టీపర్పస్ సిబ్బందితో స్తూపం కనపడకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పి వేయించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నిబంధన మేరకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శి రత్నాకర్ తెలిపారు.