నీరు కలుషితం కాకుండా చూడాలి: ఇంజనీర్ రామచందర్ 

Ensure that water is not polluted: Engineer Ramachanderనవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మిషన్ భగీరథ పైపు లా లీకేజీ తో నీరు కలుషితం కాకుండా చూడాలని మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ రామచంద్ర గురువారం అన్నారు. మండలంలోని అర్గుల్ గ్రామ శివారులో గల మిషన్ భగీరథ కార్యాలయంలో ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల గ్రామ మంచినీటి సహాయకులకు మూడవరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ రామచందర్ హాజరై మాట్లాడుతూ గ్రామాలలో మిషన్ భగీరథ పైప్లైన్లు లీకేజీ కాకుండా చూసుకుంటూ లీకేజ్ అయిన నీటితో నీరు కలుషితం కాకుండా చూడాలని గ్రామ మంచినీటి సహాయకులకు సూచించారు. మిషన్ భగీరథ పైప్ లన్ లీకేజ్ అయితే ఎవరో వచ్చి రిపేర్ చేస్తారని ఎదురు చూడకుండా గ్రామ మంచినీటి సహాయకులు దాన్ని రిపేర్ చేస్తూ గ్రామ ప్రజలకు నాణ్యమైన నాణ్యత గల నీటిని అందించాలన్నారు. గ్రామాలకు వచ్చిన మిషన్ భగీరథ వాటర్ ను వాటర్ ట్యాంకులకు నింపిన తర్వాత వాటర్ ట్యాంకులు బ్లీచింగ్ పౌడర్ వేసి 45 నిమిషాల తర్వాత ప్రజలందరికీ త్రాగడానికి నీరును పంపిణీ చేయాలని సూచించారు. గ్రామాలలో బోరు బావులు నదినీరు కలిసితం కాకుండా చూడవలసిన బాధ్యత గ్రామ మంచినీటి నాయకుల మీద ఉందని తెలియజేశారు. గ్రామంలోని ప్రజలందరూ మిషన్ భగీరథ వాటర్ త్రాగేందుకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ల  బ్లీచింగ్ పౌడర్ ఏ విధంగా కలిపి పోసే విధానాన్ని ఒక బకెట్లో బ్లీచింగ్ పౌడర్ వేసి కలిపే విధానాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ డి గంగారం, మిషన్ భగీరథ గ్రిడ్డు డి ఈ శివకృష్ణ మిషన్ భగీరథ ఏఈలు నరేందర్ రెడ్డి , మోహన్ రెడ్డి , చైన్ మెన్లు రోడ్డ సాయన్న మధు మారుతి రంజిత్ రాజు ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల మంచినీటి సహాయకులు తదితరులు పాల్గొన్నారు.