బెంగళూర్ : డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఏడు మ్యాచుల్లో ఆరింట ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ బెర్త్ కోసం గ్రూప్ దశలో చివరి రెండు మ్యాచుల్లోనైనా విజయం సాధించాలనే పట్టుదల ఆ జట్టులో కనిపిస్తుంది. మరోవైపు నెదర్లాండ్స్ రెండు విజయాలతో ఇంగ్లాండ్ కంటే మెరుగైన స్థితిలో నిలిచింది.. చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ఢ నేడు.