– సెమీస్‌లో నెదర్లాండ్స్‌పై 2-1గోల్స్‌తో గెలుపు
బెర్లిన్(జర్మనీ): యూరో-2024 ఫైనల్లోకి ఇంగ్లండ్ జట్టు దూసుకెళ్లింది. బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టు 2-1గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున హారీ కేన్(18వ ని.లో) పెనాల్టీని గోల్‌గా మలచగా.. రెండో గోల్‌ను ఓలీ వాల్కటన్(90వ ని.)లో చేశాడు. ఇక నెదర్లాండ్స్ తరఫున ఏకైక గోల్‌ను సిమన్స్(7వ ని.)లో కొట్టాడు. మ్యాచ్ ప్రారంభమైన 7వ ని.లో నెదర్లాండ్స్ జట్టు ఒక గోల్ కొట్టి ఆధిక్యతలో నిలిచినా.. తొలి అర్ధభాగంలోనే ఇంగ్లండ్ జట్టు మరో గోల్ కొట్టి స్కోర్‌ను సమం చేసింది. ఇక రెండో అర్ధభాగం ముగింపులో ఇంగ్లండ్ మరో గోల్ కొట్టడం విజయం లభించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు టైటిల్‌కై స్పెయఇన్‌తో తలపడనుంది.