– 2-0తో టెస్టు సిరీస్ వశం
వెల్లింగ్టన్ : భారత్‌పై చారిత్రక టెస్టు సిరీస్ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ గట్టి దెబ్బ కొట్టింది. వరుసగా తొలి రెండు టెస్టుల్లో మెరుపు విజయాలు సాధించింది. మరో మ్యాచ్ ఉండగానే 2-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. 583 పరుగుల రికార్డు ఛేదనలో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. టామ్ బ్లండెల్ (115, 102 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో మెరిసినా.. న్యూజిలాండ్ 54.2 ఓవర్లలో 259 పరుగులకు కుప్పకూలింది. నాథన్ స్మిత్ (42), డార్లీ మిచెల్ (32), టామ్ లేథమ్ (24) ఫర్వాలేదని పించగా.. కేన్ విలియమ్సన్ (4), రచిన్ రవీంద్ర (6), డెవాన్ కాన్వే (0) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ (3/5), క్రిస్ వోక్స్ (2/20), బషీర్ (2/110) రాణించారు. ఇంగ్లాండ్ వరుస ఇన్నింగ్స్‌ల్లో 280, 427/6 పరుగులు చేయగా.. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన హ్యారీ బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.