
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థులకు ఆంగ్ల భాష పై ఇంగ్లీష్ లార్న్ విత్ ఫన్ అంశంపై అనిల్ శిక్షణ ఇచ్చారు. ఆంగ్ల భాష సృజనాత్మకత, స్టోరీ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు నేర్చుకుంటూ, చుట్టూ ఉన్నవారికి ఆంగ్లం నేర్పగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధు శ్రీ వాత్సవ, ఆంగ్ల అధ్యాపకులు వెంకటరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.