ఆర్టీసీ డిపోలో ఉల్లాసంగా వనభోజనాలు..

Fun food at RTC depot..నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తూ.. డిపోల్లో మరమ్మతులు చేస్తూ తీరిక లేకుండా గడిపే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌ సిబ్బంది రిలీఫ్‌ కోసం సంస్థ వినూత్నంగా వనభోజనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని బాన్సువాడ ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్ ఆర్ సరితా దేవి తెలిపారు. శుక్రవారం బాన్సువాడ ఆర్టీసీ బస్సు డిపో పరిధిలో రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాల మేరకు నేడు బస్ డిపోలో వనభోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ సరస్వతి మరియు శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ సరితా దేవి మాట్లాడుతూ నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ, తీరిక లేకుండా కాలం గడిపే ఆర్టీసీ కార్మికుల ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకై డిపో పరిధిలో వన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సంస్కృతి కార్యక్రమాలు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారని తెలిపారు. ఇందులో ఆర్టీసీ కార్మికులకు రీజినల్ మేనేజర్ సరస్వతి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బస్వంత్, కిష్టయ్య, కృష్ణ, జగదీష్, రాజారాం, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.