పచ్చిరొట్ట ఎరువులతో భూసారం వృద్ధి..

నవతెలంగాణ- బెజ్జంకి

పచ్చిరొట్ట ఎరువులతో భూసారం వృద్ధి చెంది ఆశించిన పంట దిగుబడులు వస్తాయని ఏఓ బండ సంతోష్ తెలిపారు.శుక్రవారం మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామంలో సాగుచేసిన జీలుగా క్షేత్రాన్ని ఏఓ సంతోష్, ఏఈఓ మౌనిక రైతులతో కలిసి సందర్శించి పరిశీలించారు. చౌడు నేలల్లో జీలుగను సాగుచేసి వరి నాటు ముందు సమయంలో కలియ దున్నాలని రైతులకు వ్యవసాయాధికారులు సూచించారు.రైతులు పాల్గొన్నారు.