నవతెలంగాణ – జక్రాన్ పల్లి
పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి వారి సమగ్ర అభివృద్ధి శ్రీనివాస్ గురువారం అన్నారు. మండలంలోని తోర్లికొండ ఉన్నత పాఠశాలలో బడిబాటలో భాగంగా గ్రామస్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ ఐకెపి సిబ్బంది మరియు బీడీసీ సభ్యులు పాల్గొన్నారు. పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు మధ్యాహ్న భోజనం ఉచిత యూనిఫాంలో నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. గ్రామంలోని బడి ఈడు గల పిల్లలందరూ బడిలో చేరే విధంగా పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మీరు కూడా సహకరించాలని కోరడం జరిగింది. ఇందుకు వీడిసివారు వారి వంతు సహకారాన్ని అందించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా బడిబాట యొక్క కరపత్రాలను పాఠశాల ఆవరణలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్ , ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జంగం అశోక్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ బృందం అంగన్వాడి ఉపాధ్యాయులు వీడిసి సభ్యులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.