
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత బాలూర పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న కుప్పాల యశ్వంత్ గతకొంత కాలంగా చదువు నిలిపి మోటార్ సర్వీసింగ్ సెంటర్ లో పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎంతచెప్పినా పాఠశాలకు వెళ్లడం లేదు. ఇతన్ని విద్యాశాఖ సిబ్బంది బడి బయట సర్వేలో గుర్తించారు. కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు హరిత, కాంప్లెక్సు సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు విద్యార్ధికి , విద్యార్ధి తల్లికి కౌన్సిలింగ్ నిర్వహించారు. బడికి రానని మెండికేసిన విద్యార్ధిని ఒప్పించి కొత్తగూడెం లోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించారు. అక్కడ విద్యార్ధికి అన్ని సౌకర్యాలతో విద్య లభించనున్నది.