మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ పాఠశాలలో నిర్వహించిన కళా ఉత్సవ పోటీలు శుక్రవారం అలరించాయి. జడ్పిహెచ్ఎస్ ఇంద్ర నగర్ పాఠశాల ఆవరణలో మండల స్థాయి కళా ఉత్సవ పోటీల నిర్వహించారు. ఇందులో భాగంగా పలు రకాల నాట్యము ఆటలు పాటలు చిత్రలేఖనం గ్రూప్ డాన్స్ సింగల్ డాన్స్. పలు రంగాలలో ప్రదీప్ కనపరిచిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ తమ కళలను ప్రదర్శించుకునేందుకు కళా ఉత్సవం చక్కని వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు, ఉపాధ్యాయులు శంకర్, సమ్మయ్య, జైపాల్, చంద్రారెడ్డి, వసంతరావు, రేణుక, రజిత, వనిత, స్వామి, కాటాపూర్ ఇందిరానగర్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.