అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా ముగ్గుల పోటీలు

– రంగవల్లికల ద్వారా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత  బయటకు వెలబడుతుంది అని పిలుపునిచ్చిన నగర మేయర్ దండు నీతో కిరణ్
నవతెలంగాణ- కంటేశ్వర్
 నిజాంబాద్ డిస్టిక్ డాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు నగరంలోని సుభాష్ నగర్ లోని ఎస్ ఎఫ్ ఎస్ హై స్కూల్ నందు ముగ్గుల పోటీ  సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర మేయర్ దిండు నీతు కిరణ్, విశిష్ట అతిథిగా ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాల ఫాదర్ రెవరెండ్ జాయిస్ థామస్ అలాగే బ్రదర్ తామస్ నిజాంబాద్ డిస్టిక్ డాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు తోగటి ఆనంద్ బాబు చంద్రకళ అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ దండు నీతు కిరణ్ మాట్లాడుతూ పండగల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి యువతకి తెలియడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నిజామాబాద్  డిస్ట్రిక్ట్ డాన్స్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమం  అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ థామస్, చంద్రకళ, నిజాంబాద్ డిస్టిక్ డాన్స్ అసోసియేషన్ కార్యవర్గం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.