ఆద్యంతం వినోదాత్మకం

Priyadarshiప్రియదర్శి, నభా నటేష్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘డార్లింగ్‌’. అశ్విన్‌ రామ్‌ దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో ప్రియదర్శి మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘కమెడియన్‌గా మొదలై సీరియస్‌ కథలు చేస్తూ ఈసినిమాతో లవర్‌ బారుగా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కంటెంట్‌కి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాను. కొత్త కథలు, వినూత్నమైన ఆలోచనలని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ‘మల్లేశం, బలగం, సేవ్‌ ది టైగర్స్‌’కి వచ్చిన రెస్పాన్స్‌ చూస్తుంటే… ఫ్యామిలీ డ్రామాకి ఎప్పుడూ స్పేస్‌ ఉందని నిరూపించాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇండియన్‌ సొసైటీలో ఎవర్‌ గ్రీన్‌. జనరల్‌గా మ్యారేజ్‌ని చాలా స్టీరియోటిపికెల్‌ అప్రోచ్‌లో చూస్తాం. డార్లింగ్‌ విషయానికి వస్తే.. ఉమన్‌ క్యారెక్టర్‌ స్ప్లిట్‌ పర్షనాలిటీ అనే స్పెషల్‌ కండీషన్‌ ఉంటుంది. దీన్ని ప్రజెంట్‌ చేసిన తీరు చాలా వైవిధ్యం. రెండు క్యారెక్టర్‌లు సీరియస్‌గా బాధపడుతుంటే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. డార్క్‌ కామెడీలో ఉన్న మ్యాజిక్‌ ఇది. ఇందులో అది చాలా అద్భుతంగా ఎక్స్‌ఫ్లోర్‌ చేశాం. నభా లాంటి యాక్టర్‌తో నేనెప్పుడూ పని చేయలేదు. నాలాంటి యాక్టర్‌తో తనూ ఎప్పుడూ వర్క్‌ చేయలేదు. మా ఇద్దరి పెయిరింగ్‌ చాలా ఫ్రెష్‌గా ఉందని చాలా మంది అన్నారు. ఇందులో నా క్యారెక్టర్‌, నభా క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మా నిర్మాతలు నిరంజన్‌, చైతన్య ట్రూ డార్లింగ్స్‌. ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. డైరెక్టర్‌ అశ్విన్‌ రామ్‌లో మంచి లీడర్‌ షిప్‌ క్యాలిటీస్‌, కమ్యునికేషన్‌ స్కిల్స్‌, క్లియర్‌ విజన్‌ ఉన్నాయి. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్‌ అవుతాడు. ఈ సినిమాని అద్భుతంగా తీశాడు’.