చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామ్ నగర్ బన్నీ’. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహించారు. నేడు (శుక్రవారం) ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో చంద్రహాస్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
– ఈ సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజారు చేస్తారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా నా తొలి సినిమా కావడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఎంట్రీ మరొకరికి దొరుకుతుందని అనుకోను. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనే కాన్ఫిడెన్స్ మా టీమ్ అందరిలో ఉంది.
– ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ గోపాల్ వర్మ నా గురించి హీరో క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. అలాగే మా సినిమా చూసి మీకు నచ్చకుంటే నాకు మీ టికెట్ ఫొటోతో ఇన్ స్టా ద్వారా చెప్పండి మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పాను. సినిమా మీద నమ్మకంతోనే అలా అన్నాను.
– ఈ సినిమాలో నేను సూపర్ హీరోలా కనిపించను. ఒక సాధారణ యువకుడిగానే కనిపిస్తా. నేను తిట్లు తింటాను, అవమానాలు ఎదుర్కొంటాను. రకరకాల జాబ్స్ చేస్తాను. కొన్నిసార్లు జాబ్ లెస్‌గా ఉంటాను. అన్ని రకాల ఎమోషన్స్ చేసే అవకాశం ఈ చిత్రంలో కలిగింది.
– సకుటుంబంగా ఫ్యామిలీ ఆడియెన్స్ వెళ్లి ఈ సినిమాని చూడొచ్చు. నాన్న(ప్రభాకర్) ఈ సినిమాలో ఓ చిన్న రోల్ చేశారు. దర్శకుడు శ్రీనివాస్ మహత్ నన్ను స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమా తర్వాత నేను అన్ని ఎమోషన్స్, అన్ని జోనర్స్ చేయగలను అనే పేరొస్తుంది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను.