ఆద్యంతం వినోదాత్మకం

throughout Entertainingనివాస్‌, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్‌ పథ్వీ, వినోద్‌ కుమార్‌, రఘుబాబు, భరద్వాజ్‌,  ఖయ్యూం నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని చెన్నా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై శరత్‌ చెన్నా నిర్మిస్తున్నారు. వెంకటేష్‌ వీరవరపు దర్శకుడు. గురువారం రామానాయుడు స్టూడియోలో  పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్‌ నివ్వగా, సంగీత దర్శకులు ఆర్‌.పి. పట్నాయక్‌  కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.ఈ సందర్భగా నటుడు పథ్వీ మాట్లాడుతూ,’మంచి కథ, కథనాలతో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఒక ఇంట్రెస్టింగ్‌ రోల్‌  చేస్తున్నాను. నిర్మాత శరత్‌ చెన్నా బాగా చదువుకున్న వ్యక్తి. ఎంతో ప్యాషన్‌తో ఈ మూవీ చేస్తున్నారు. అలాగే దర్శకుడు వెంకటేష్‌ ఈ మూవీని అనేక ఇంట్రెస్టింగ్‌ ట్విస్టులతో  ఎంటర్‌టైనింగ్‌గా రూపొందిస్తున్నారు’ అని తెలిపారు. ‘ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. 30 ఇయర్స్‌ పథ్వీ, వినోద్‌ కుమార్‌, రఘు బాబు కీ రోల్స్‌ చేస్తున్నారు. ఈ  నెల 18వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తున్నాం. మాకు ఎంతో సపోర్ట్‌ గా నిలుస్తున్న మా ప్రొడ్యూసర్‌ శరత్‌, పథ్వీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజరు పట్నాయక్‌కి థ్యాంక్స్‌’ అని  దర్శకుడు వెంకటేశ్‌ వీరవరపు చెప్పారు. హీరో నివాస్‌ మాట్లాడుతూ, ‘ఇదొక మంచి వినోదాత్మక చిత్రం. మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేసేలా ఉంటుంది. ఈ సినిమాతో హీరోగా  పరిచయం కావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ‘ఈ సినిమాతో హీరోయిన్‌గా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది’ అని హీరోయిన్‌ అమిత శ్రీ చెప్పారు. నిర్మాత  శరత్‌ బాబు మాట్లాడుతూ,’సినిమా పేరులో గుర్తులేదు ఉంది. కానీ ఈ సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఫస్ట్‌ చిత్రంతోనే ఒక సక్సెస్‌ ఫుల్‌ ప్రాజెక్ట్‌ చేస్తామనే  నమ్మకంతో ఉన్నాం’ అని తెలిపారు.