వినోదాత్మకంగా స్వీటీ నాటీ క్రేజీ

వినోదాత్మకంగా స్వీటీ నాటీ క్రేజీత్రిగుణ్‌, శ్రీజిత ఘోష్‌ కాంబోలో అరుణ్‌ విజువల్స్‌ బ్యానర్‌ మీద ఆర్‌. అరుణ్‌ నిర్మించిన చిత్రం ‘స్వీటీ నాటీ క్రేజీ’. రాజశేఖర్‌.జి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పలువురు అతిథుల సమక్షంలో ఈ చిత్రాన్ని లాంఛ నంగా ప్రారంభించారు. త్రిగుణ్‌, శ్రీజిత ఘెష్‌, ఇనయ, రాధ, అలీ, రఘుబాబు, రవి ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్‌ కొట్టగా, దామోదర ప్రసాద్‌ స్క్రిప్ట్‌ అందజేశారు. బెక్కెం వేణు గోపాల్‌ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. హీరో త్రిగుణ్‌ మాట్లాడుతూ, ‘టైటిల్‌కు తగ్గట్టుగా.. స్వీటీ, నాటీ, క్రేజీలా ఉంటాయి. నాకు ఇంత వరకు కామెడీ చిత్రాలు బాగా వర్కౌట్‌ అయ్యాయి. ‘కథ’తో మొదలైన నా ప్రయాణంలో ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుంది’ అని అన్నారు. ‘త్రిగుణ్‌ ద్విభాషా చిత్రంగా ఈ మూవీని చేస్తున్నారు. తెలుగులో నేను నటిస్తున్నాను. తమిళంలో నా పాత్రను రవి మరియ చేస్తున్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్‌ సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని నటుడు రఘుబాబు చెప్పారు. నటుడు రవి మరియ మాట్లాడుతూ, ‘తమిళంలో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. దర్శకత్వం వహించాను. ఇప్పుడు ఈ చిత్రంలో నేను ఓ మంచి పాత్రను పోషిస్తున్నాను’ అని తెలిపారు. నిర్మాత అరుణ్‌ మాట్లాడుతూ, ‘మా సినిమా పూర్తి ఎంటర్టైన్మెంట్‌ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. అందరినీ నవ్వించేలా ఉంటుంది. మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ”సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. అందరినీ నవ్వించేలా ఉంటుంది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ, కామెడీ యాంగిల్‌లో సినిమా ఉంటుంది’ అని దర్శకుడు రాజశేఖర్‌ చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ :సి.విజయశ్రీ, ఆర్ట్‌ : జయకుమార్‌.