ఉప్పొంగిన అభిమానం..

– కాంగ్రెస్ అధ్వర్యంలో అట్టహసంగా సీఎం జన్మదిన వేడుకలు
– పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక గుర్తింపు
నవతెలంగాణ-బెజ్జంకి
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుగుతుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అభిమానం ఉప్పొంగింది.శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను బాణసంచాలు కాల్చి అట్టహసంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ హజరై కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ద్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని..ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా ప్రణాళికబద్దంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ప్రజలు సంయమనం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.మండల వ్యాప్తంగా అయా గ్రామాల్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు మిన్నంటాయి.మండల ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్, మహిళాధ్యక్షురాలు కనగండ్ల జ్యోతి, ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, మండలాధికార ప్రతినిధి జనాగం శంకర్, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మధు సూధన్ రెడ్డి, అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు హజరయ్యారు.
• ముఖ్యమంత్రి చిత్రపటమందజేత..
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డికి అందజేశారు.
• పారిశుధ్య కార్మికులకు ప్రాధాన్యత..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ప్రాధాన్యతిచ్చి గుర్తింపునిచ్చారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది,పారిశుధ్య కార్మికులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం మహిళ పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.