
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని నందికొండ మున్సిపల్ 1వ వార్డు కౌన్సిలర్ మంగత నాయక్ అన్నారు.బుధవారం మున్సిపాలిటీ పరిధిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నందికొండ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ,కమిస్నర్ శ్రీను ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలు కీలకమన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, చెట్టే జీవరాశి మనుగడకు ఆధారమని, పర్యావరణ పరిరక్షణకు అందరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కలు నాటడంతో పర్యావరణ సమతుల్యం ఏర్పడి సకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. అప్పుడే మనిషి మనుగడ బాగుంటుందన్నారు. ఎక్కడైతే చెట్లు ఎక్కవగా ఉంటాయో అక్కడ పర్యావరణ పరిరక్షణ ఉంటుందని, మంచి గాలి, వానలు పడి నీరు పుష్కలంగా దొరుకుతుందన్నారు. మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు, పర్యావరణానికి ఏ విధమైన ఉపయోగాలు కలుగుతాయో వివరించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది,పారిశుద్ధ్య సిబ్బంది తదితరులున్నారు.