కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఎన్విరాన్మెంట్ అధికారి

Environment Officer who received the certificate of appreciation at the hands of the Collectorనవతెలంగాణ – బడంగ్ పేట్ : మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపల్ లో ఎన్విరాన్మెంట్ అధికారిగా పనిచేస్తున్న ముందారి.శ్రీనివాస్ కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ చేతుల మీదుగా సోమవారం జీఎంఅర్ ఎయిర్ పోర్టు ఆవరణంలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు అధికారులు మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టు సమీప ప్రాంతంలో మృతి చెందిన జంతు కళేబరాలను పలు కాలనీల నుండి తీసుకువచ్చి రోడ్లకు ఇరువైపుల పడవేయటంతో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని తెలిపారు. అలా కాకుండా ఎప్పటికపుడు మృతి చెందిన జంతు కళేబరాలను తొలగిస్తూ విమానాల రాకపోకలకు ఏలాంటి అంతరాయం కలగకుండా జల్ పల్లి మున్సిపల్ లో ఎన్విరాన్మెంట్ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్ కృషి అభినందనీయమన్నారు. జీ ఎం అర్ ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ అధికారులు నిర్వహించిన సర్వేలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఉత్తమ అధికారిగా గుర్తించి రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ చేతుల మీదుగా జీ ఎం అర్ అధికారుల సహకారంతో ఎం.శ్రీనివాస్ కు ప్రశంసా పత్రాన్ని అందచేసిన కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపల్ కమిషనర్ బి. వేంకట్రాం,తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి,జీ ఎం అర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.