స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ ఆద్వర్యంలో ప్రోగ్రాం ఆఫీసర్ డి.నరసింహారావు పర్యవేక్షణలో బుధవారం సైన్స్ విద్యార్ధినిలు కు స్థానిక వ్యవసాయ కళాశాలలో బొటానికల్ టూర్ నిర్వహించారు.వ్యవసాయ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లు స్రవంతి,ఎన్.చరిత లు విద్యార్థులకు వివిధ రకాలైన మొక్కలు,సేంద్రీయ పద్దతులు, పుట్ట గొడుగులు పెంపకం పై అవగాహన కల్పించారు. వీటిలో ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల మొక్కలు,అరుదైన వృక్ష జాతి మొక్కలు,విదేశాల నుండి దిగుమతి చేసుకున్న మొక్కలు, వాటి సాగు విధానాల గురించి వివరించారు.విద్యార్ధినిలు కు నూతన వ్యవసాయ పద్దతులు పై అవగాహన కల్పించి వారికి “వ్యవసాయం అంటే కష్టం కాదు ఇష్టం” అనే భావనను కల్పించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పీఏ నరేష్ పాల్గొని విద్యార్ధులకు కెరీర్ గైడెన్స్ పై బోధించి విద్యార్ధుల్లో ఆత్మస్థైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎ.అనిత పాల్గొన్నారు.