మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యత : ఎస్సై సతీష్ రెడ్డి 

నవతెలంగాణ హలియా 
మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యత సాధించవచ్చు అని హాలియా ఎస్సై సతీష్ రెడ్డి  అన్నారు .శనివారం  హాలియా మున్సిపాలిటీ పరిధి లోని టైం స్కూల్ ఆధ్వర్యంలో  నిర్వహించిన హరిత హారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు   విద్యార్థిని, విద్యార్దులు పర్యావరణ సంరక్షణ మరియు మొక్కలు పెంపకం పై ర్యాలీ నిర్వహించి అవగాహనా సదస్సు ను ఏర్పాటు చేయటం జరిగింది. కార్యక్రమంను ఉద్దేశించి ఎస్సై  మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణ లో బాగస్వామ్యులు కావాలి అని సూచించారు. మీరు నాటిన ప్రతి మొక్క భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేస్తుంది అని సూచించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ కత్తి కోటి రెడ్డి గారు, డైరెక్టర్ మంద నరేందర్ రెడ్డి గారు ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్దులు పాల్గొన్నారు.