నవతెలంగాణ – నెల్లికుదురు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరిగకూటి శ్రీనివాస రెడ్డి, ఎన్.స్.స్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు అన్నారు. శుక్రవారం రోజున కళాశాల ఆవరణలో ఎన్.స్.స్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ నిర్వహించి, పిచ్చి మొక్కలను, ముళ్ళ పొదలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరి ఇంటి ముందు వారు కూడా శుభ్రం చేసుకోవడం పట్ల సీజనల్ వ్యాధి నుండి బయటపడవచ్చు అని అన్నారు ఇంటి పరిసర ప్రాంతంలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అన్నారు ఎవరి ఇంటి ముందు వారు శుభ్రం చేసుకున్నట్లయితే ఆ గ్రామం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందినందుకు దోహదపడుతుందని అన్నారు దీంతో సీజనల్ వ్యాధుల నుండి రక్షించుకునే అవకాశం ఉందని అన్నారు యువత ముందడుగు వేయాలని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు రావని, కావున ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం ఎన్.స్.స్ వాలంటీర్లకు స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకలు బంటు కవిరాజు, రఘురాం, భూక్యా నాగేశ్వర రావు, పెద్దూరి వెంకటేశ్వర్లు, ఎనమాల సుధాకర్, లడే మహేందర్, కందికొండ బాబు, దేశెట్టి యాకన్న, సుభాష్, కూన సతీష్, అధ్యాపకేతర బృందం లక్ష్మణ్, ప్రదీప్, రమ, వెన్నెల, బిక్షు మరియు ఎన్.స్.స్ వాలంటీర్లు పాల్గోన్నారు.