
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఎంపీఓ కూచన ప్రకాష్ అన్నారు. బుధవారం మండలంలో 40 గ్రామాల్లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ చేపట్టి బస్టాండ్ ఆవరణలో మానవహారాన్ని నిర్వహించి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత ప్రతి ఒక్కరు పాటిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని దాంతో పర్యావరణం క్షీణిస్తుంది అని తెలిపారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి వినోద్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గారె కృష్ణమూర్తి, అంగన్వాడి టీచర్లు విజయరాణి, కవిత, కృష్ణవేణి, శశిరేఖ, జిపి సిబ్బంది కరొబార్ మల్లయ్య, పిల్లి రాజు, కొండేటి రాజు, ఐత సాంబరాజు, ఐత యాకమ్మ, ఐత కోమల, గౌరీ నర్సమ్మ, గారె జ్యోతి, గారె సబిత, మచ్చ సంపత్, విఓఏలు పుష్ప, యాకయ్య, శ్రీలత, హసీనా తదితరులు పాల్గొన్నారు.