
నవతెలంగాణ – నెల్లికుదురు
పర్యావరణ కాలుష్యంతో భవిష్యత్ తరాలకు ఎంతో ప్రమాదం ఉందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బంటు కవిరాజు అన్నారు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ ఆధ్వర్యంలో పర్యావరణ కాలుష్యంపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు . ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బంటు కవిరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుందని దీని వల్ల భవిష్యత్ తరాలు పెను ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. సకల సృష్టికి జీవనాధరమైన గాలి, నీరు, ధరిత్రిని కలుషితం చేస్తూ పోతే భవిష్యత్ అంధకారం అవుతుందని తెలిపారు. కాలుష్యంతో జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు అభివృద్ధి పేరుతో పర్యావరణానికి ముప్పు వాటిలే పనులు చేయొద్దని, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, వృక్ష సంపద ఇవ్వగలమని తెలిపారు. ఢిల్లీ లాంటి ప్రధాన నగరాలు వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయని, కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక వ్యూహాల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పర్యావరణ నియంత్రణ , పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కే.రామ్మూర్తి, పి.వెంకటేశ్వర్లు, బి.నాగేశ్వరరావు, కె.సతీష్, డి.యాకన్న, కె.స్పందన అధ్యాపకేతర బృందం గౌరీ, లక్ష్మణ్, సైదా, ప్రదీప్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.