నవతెలంగాణ – దుబ్బాక రూరల్
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని పద్మనాభుని పల్లి గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మిషన్ లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోస్టర్ ఆవిష్కరించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా యువజన సంఘల బాధ్యులు బాయికాడి లక్ష్మణ్, మాట్లాడుతూ పర్యావరణం సంరక్షణ అనేది ప్రతి యువకున్ని బాధ్యతని అన్నారు. సహజ వనరులను పొదుపుగా వాడాలన్నారు. ప్లాస్టిక్ ని సాధ్యమైనంత వరకు నిషేధించాలని ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయ సంచులను వాడాలని పేర్కొన్నారు.తదనంతరం సామాజిక కార్యకర్త ముక్కపల్లి సాగర్ మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణ కోసం ప్రతి వ్యక్తి మొక్కలను నాటాలని వాటిని సంరక్షించుకోవాలన్నారు. రైతులు రసాయనాలు లేకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు పండించాలని రసాయనాలకు దూరంగా ఉండాలని సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని అన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యవంతమైన స్వచ్ఛమైన జీవితాన్ని ఆస్వాదించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో శ్రీధర్ ,హరి సందీప్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు