పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

– ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ ఈ కృష్ణవేణి
– మేడారం అటవీ ప్రాంతంలో చెత్త ఏరువేత
నవతెలంగాణ -తాడ్వాయి : పర్యావరణం పరిరక్షణ మనందరి బాధ్యత అని ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ, డిఆర్ఓ ఈ కృష్ణవేణి అన్నారు. సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఏటూర్ నాగారం ఎఫ్డిఓ అనూజ్ అగర్వాల్ ఆదేశాల మేరకు మేడారం అటవీ ప్రాంతంలో క్లీన్ మేడారం- గ్రీన్ మేడారం లో భాగంగా అడవి ప్రాంతంలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించుకుంటూ, భక్తులకు పరిసరాల పరిశుభ్రత పర్యావరణం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ కృష్ణవేణి మాట్లాడుతూ అడవి ప్రాంతాలలో బస చేసే సందర్శకులు విచ్చలవిడిగా ఎక్కడబడితే అక్కడ జంతువుల కళేబరాలు ప్లాస్టిక్ పదార్థాలను పారేయరాదని ఒక ప్రదేశంలో వేయాలన్నారు. భావితరాల కోసం కచ్చితంగా పర్యావరణం, వనరులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో రసాయన శాస్త్ర పాత్ర ఎంతో ఉందన్నారు. వ్యవస్థ ఎంతో మార్పులు చెందుతున్న పర్యావరణ ప్రయోగాలు ఇంకా పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాయని తెలిపారు. మేడారం జాతరకు వచ్చే ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పర్యావరణం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జ్ఞానేశ్వర్ ఎఫ్ ఎస్ ఓ మేడారం వాంకుడోతు లింగా నాయక్, గంగారం ఎఫ్ఎస్ఓ కుమారస్వామి, కె స్వరూప రాణి, ఆఫీసర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.