మట్టి ప్రతిమలతో పర్యావరణ పరిరక్షణ 

నవతెలంగాణ -బెజ్జంకి

వినాయక నవరాత్రోత్సవాల్లో మట్టితో తయారుచేసిన ప్రతిమలను వినియోగించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించవచ్చునని సర్పంచ్ రాగుల మొండయ్య సూచించారు.సోమవారం మండల పరిధిలోని చీలాపూర్ గ్రామ పంచాయతీ అధ్వర్యంలో గ్రామస్తులకు మట్టి వినాయక ప్రతిమలను సర్పంచ్ మొండయ్య పంపిణీ చేశారు.బేగంపేటలో బీఆర్ఎస్ యువజన నియోజకవర్గ నాయకుడు కొర్వి తిరుపతి స్వంత ఖర్చులతో  గ్రామస్తులకు మట్టి ప్రతిమలను పంపిణి చేశారు.అయా గ్రామాల గ్రామస్తులు పాల్గొన్నారు.