నవతెలంగాణ – హైదరాబాద్
విజిల్ ఆంటీ – ఎండ్ ఆఫ్ స్కామ్ సేల్ (EOSS) క్యాంపెయిన్‌కు కేన్స్ లయన్స్ 2024లో రజత పతకాన్ని గెల్చుకున్నామని భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. నటి నోరా ఫతేహి, విజిల్ ఆంటీ నటించిన సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇప్పటివరకు 28 మిలియన్లకు పైగా వ్యక్తులకు చేరగా, 22 మిలియన్ల వీక్షణలను పొందింది. డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూపొందించిన కాల్పనిక సోషల్ మీడియా పాత్ర విజిల్ ఆంటీ. ఎండ్ ఆఫ్ స్కామ్ సేల్ (EOSS) క్యాంపెయిన్‌లో భాగంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నటి నోరా ఫతేహి స్టార్ పవర్‌ని ఉపయోగించి మోసగాళ్ల కార్యనిర్వహణ పద్ధతిని ప్రతిబింబించేలా చేయడంతో పాటు డీప్‌ఫేక్‌లను, మోసాల బారిన సులభంగా ఎలా పడతారో అనే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించింది. బ్యాంక్ నకిలీ బ్రాండ్‌ను సృష్టించింది మరియు ‘లులుమెలోన్’ కోసం ఇన్‌స్టాగ్రామ్ పేజీని సృష్టించడం ద్వారా పౌరులు దాని చట్టబద్ధతను విశ్వసించేలా చేయడంతో పాటు ఇది అద్భుతమైన ఆఫర్‌లు మరియు డీల్‌లతో నిజమైన బ్రాండ్‌గా ధ్వనిస్తుంది. ‘ఈవెంట్స్ & స్టంట్స్’ ఉత్తమ ఉపయోగం కోసం చేపట్టిన ఈ క్యాంపెయిన్ ప్రతిష్టాత్మక కేన్స్ లయన్స్‌లో గుర్తించబడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రూప్ హెడ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు డైరెక్ట్ టు కన్స్యూమర్ బిజినెస్ హెడ్ రవి సంతానం ఇలా అన్నారు, “మోసాలపై అవగాహన కోసం చేపట్టిన ఈ క్యాంపెయిన్ కేన్స్ లయన్స్‌ను గెలుచుకోవడం ద్వారా వినియోగదారులు డిజిటల్ మోసాలతో బాధితులుగా మారకుండా ఉండేందుకు, ఈ సమస్యపై అవగాహన కల్పించడంలో మా నిబద్ధతకు అద్దం పడుతుంది. ఈ గుర్తింపు మా ఏజెన్సీ భాగస్వాములైన ఎఫ్‌సీబీ కిన్నెక్ట్ (FCBKinnect) అసాధారణమైన సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం. కలిసి పని చేస్తూ, వినూత్న విధానంతో ప్రభావవంతమైన ప్రచారాన్ని రూపొందించినందుకు మేము సంతోషిస్తున్నాము. మాకు, సంబంధిత కారణం కోసం శక్తివంతమైన కథనాన్ని చెప్పడం సంతోషదాయకంగా ఉంది మరియు సమస్య గురించి మరింత ఎక్కువ మంది వినియోగదారులకు అవగాహన కల్పించడానికి మేము కట్టుబడి ఉంటాము’’ అని వివరించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎస్‌వీపీ (SVP) & డిజిటల్ మార్కెటింగ్ హెడ్ జాహిద్ అహ్మద్ మాట్లాడుతూ, ‘‘పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ లయన్స్‌లో విజేతలుగా నిలిచినందుకు మేము సంతోషిస్తున్నాము. ఎఫ్‌సీబీ కిన్నెక్ట్‌లో మా భాగస్వాములతో కలిసి, డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించడం కోసం, ఆశావాద పక్షపాత భావనను సూక్ష్మంగా ప్రభావితం చేస్తూ, వినూత్నమైన ‘లులుమెలోన్- ఎండ్ ఆఫ్ స్కామ్ సేల్’ క్యాంపెయిన్‌ను రూపొందించినందుకు మేము గర్విస్తున్నాము. మోసాలను అడ్డుకునేందుకు ఈ ప్రభావవంతమైన క్యాంపెయిన్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు మేము గర్విస్తున్నాము’’ అని తెలిపారు. విజిల్ ఆంటీ చొరవను 2022లో ప్రారంభించగా, సురక్షితమైన బ్యాంకింగ్ అలవాట్లను అవలంబిస్తూ, అలవర్చుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహించే ప్రభావశీల విధానాన్ని పరిచయం చేసింది. సురక్షిత బ్యాంకింగ్ అవగాహనను ప్రోత్సహించడంలో, మోసగాళ్లు ఉపయోగించే వివిధ డిజిటల్ మోసాల పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఈ క్యాంపెయిన్ కీలకంగా మారంది. దీన్ని ప్రారంభించినప్పటి నుంచి, ఈ ప్రయత్నం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రెండు మిలియన్లకు పైగా అభిమానుల సంఖ్యను సంపాదించుకుంది. వివిధ రకాల మోసాలకు వ్యతిరేకంగా నిరోధక చర్యలపై వినియోగదారులకు అవగాహన కల్పించడానికి 60 రకాల కార్యకలాపాలను కవర్ చేస్తుంది. విజిల్ ఆంటీ ఎండ్ ఆఫ్ స్కామ్ సేల్ (EOSS) క్యాంపెయిన్ గోఫెస్ట్‌లో జరిగిన అబ్బిస్ అవార్డ్‌లో ఒక గ్రాండ్ ప్రిక్స్, మూడు గోల్డ్, మూడు సిల్వర్ అవార్డులు మరియు రెండు కాంస్య అవార్డులతో పాటు క్యురియస్‌లో రెండు బేబీ ఎలిఫెంట్ అవార్డులు మరియు రెండు ఈటీ ట్రెండీస్ అవార్డులను సొంతం చేసుకుంది.