భారతీయ సంస్కృతిలో ధర్మ, అర్థ, కామ, మోక్షములనే నాలుగు పురుషార్థాలకు విశేష ప్రాధాన్యముంది. ప్రపంచంలలో అతి ప్రాచీన సాహిత్యం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం. వేదానికి చెందిన మొదటి గ్రంథాలు ‘సంహిత’లు. ఋక్సంహిత, యజు:సంహిత, సామసంహిత, అధర్వసంహిత అని నాలుగు సంహితలున్నాయి. తర్వాతవి బ్రాహ్మణ గ్రంథాలు. అరణ్యాలలో అధ్యయనం చేసే గ్రంథాలు అరణ్యకాలనబడతాయి. వైదిక ఋషుల తత్త్వచింతనను వ్యక్తం చేసే గ్రంథాలు ‘ఉపనిషత్తులు’. ఇవి ఆ ఋషుల ఆత్మవిషయకమైన అనుభూతిని వ్యక్తం చేస్తాయి. అవే కాక నాలుగు ఉపవేదాలైన ఆయు, ధను, గాంధర్వ, స్థాపత్య శాస్త్రవేదాలు. ఆరు వేదాంగాలు (శిక్ష, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు). వీటిపై భాష్యాలు, టీకలుటిప్పణులను వైదిక సంస్కృత వాజ్ఞయంగా పరిగణించవచ్చు.
లౌకిక సంస్కృతి సాహిత్యం చాలా విస్త్రతమైంది. విశ్వంలోని అన్ని విషయాలనూ ఈ సాహిత్యం స్పృశిస్తుంది. ఇతిహాసాలు, పురాణాలు, ధర్మ, అర్థ, కామ శాస్త్రాలు, దర్శనాలు (ఇవి ఆరు: న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పుర్వమీమాంసా, ఉత్తరమీమాంసా), సాహిత్యశాస్త్రం, అలంకార శాస్త్రం, తంత్రశాస్త్రం… లౌకిక సాహిత్యానికి చెందిన ప్రముఖ విషయాలు. మొదట్లో ఇతిహాస (రామాయణం, భారతాలు), పురాణాలు (అష్టాదశ పురాణాలున్నాయి…భాగవతపురాణం, స్కందపురాణం మొదలైనవి). ‘శ్లోకము’ అనబడే అనుష్ఠుప్ ఛందస్సులో మొదట్లో రచింపబడ్డాయి. తర్వాత కాలంలో వేరే వృత్తపద్యాలు కూడా ప్రయోగించారు.
ధరార్థకామమోక్షాలనేవి నాలుగు పురుషార్థాలు. ఇవి ఇతిహాస, పురాణాల్లో సాక్షాత్కరించబడ్డాయి.
ఇతిహాసం
‘ఇతిహాసం’ అనగా ఇలా ఉండేదట, ఇలా జరిగిందట అని అర్థం.
‘ఇతి+హ+ఆస’ అనేది ఇతిహాస శబ్దానికి వ్యుత్పత్తి.
‘కావ్యమీమాంస’ గ్రంథకర్త రాజశేఖరుడనే అలంకారికుని ప్రకారం ఇతిహాసం పరిక్రియ, పురాకల్పం అని రెండు రకాలు.
ఒకే నాయకుడు గలది పరిక్రియ. ఉదాహరణకు: రామాయణం.
ఎక్కువ నాయకులు గలది పురాకల్పం. ఉదాహరణకు: మహాభారతం.
ఛాందోగ్యోపనిషత్తు ఇతిహాస, పురాణాలను పంచమవేదంగా వర్ణిస్తుంది.
‘సత్వంవద, ధర్మంచర’ అని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పగా, వాటిని మాటల్లోనే గాక, ఆచరణలో వ్యక్తం చేయడం వంటి విషయాలను మహాభారతం తెలియజేస్తుంది.
‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ (తైత్తిరీయోపనిషత్తు) మొదలైన ఉపదేశాలను ఉదాహరణ ద్వారా తెలియజేయడానికి అవతరించింది రామాయణం.
సంస్కృత లౌకిక సాహిత్యంలో ఆదికవి ‘వాల్మీకి’. ఆదికావ్యం/ఇతిహాసం: రామాయణం. ఇది అనుష్టువ్ వృత్తంలో ప్రధానంగా రచింపబడింది.
వల్మీకము(పుట్ట) నుండి బయటకు వచ్చినాడని వాల్మీకి, కిరాతుల మధ్య పెరిగిన రత్నకరుడు, భార్గవుడు, ప్రాచేతసుడు అనే పేర్లున్నాయి వాల్మీకి మహర్షికి.
నారదుడు వాల్మీకిని కలిసి రామకథను వివరించాడు. రామాయణాన్ని వాల్మీకి త్రేతాయుగంలో (క్రీ.పూ.800-900) రచించాడు.
వాల్మీకి రామాయణంలో ఏడు కాండలు, 24000 శ్లోకాలు, 500 సర్గలున్నాయి.
రామాయణంలోని ఏడు కాండలు వరుసగా బాల, అయోధ్యా, అరణ్య, కిష్కిన్ధా, సున్ధార, యుద్ధ, ఉత్తరకాండము.
సూర్యవంశ చరిత్రమే: రామాయణం, చంద్రవంశ చరిత్ర : భారతం.
తెలుగులో భారత, రామాయణాలను ఇతిహాసాలంటారు. నన్నయ, తిక్కన, ఎర్రనలు ఇతిహాస కవులు.
గోనబుద్ధారెడ్డి, హుళుక్కి భాస్కరుడు, మొల్ల వంటి మొదలైన రామాయణం తెలుగులో రాసిన కవులు కూడా ఇతిహాస కవులు.
కవిత్రయం వారు మహాభారతాన్ని కేవలం అనువాదం కాకుండా అనుసృజన (ుతీaఅర జతీవa్‌ఱశీఅ) చేశారు. కాబట్టి అది కేవలం ఇతిహాసం కాదు కావ్యేతిహాసం.
(సశేషం)
పురాణం
పురాపినవమ్ ఇతి పురాణం. ‘పాతదైనా కొత్తగా ఉండేది పురాణం’ అని అర్థం. వేదాలలోని కథలను పెంపొందించి ఉపాభ్యానాలతో నీతిబోధకంగా లోకవృత్తం ప్రతిబింబించేటట్లు రచించడం సాధారణంగా పురాణ పద్ధతి. ప్రాశ్చాత్యులు ఈ పురాణ వాజ్ఞయాన్ని ‘మైథాలజి’ అని పిలిచారు. ‘అమరకోశం’ గ్రంథకర్త అమర సింహుడు.
పురాణం ‘సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్యంతరం, వంశాను చరిత్రం’ అనే ఐదు లక్షణాలతో కూడుకొని ఉంటుందని లక్షణం చెప్పారు. సంస్కృతంలో 18 పురాణాలను వ్యాసుడు రచించాడని ప్రతీతి.
అవి: 1. మార్కండేయ 2. మత్స్య 3. భవిష్య 4. భాగవత 5. బ్రహ్మ 6. బ్రహ్మాండ 7. బ్రహ్మవైవర్త 8. విష్ణు 9. వాయు(శివ) 10. వరాహ 11. వామన 12. అగ్ని 13. నారద 14. పద్మ 15. లింగ 16. గరుడ 17. కూర్మ 18. స్కంద
పురాణం నిర్వచనాలు
– అధర్వణ వేదం: ప్రాచీన కథ లేదా పూర్వకథ
– శతపథ బ్రాహ్మణం: ప్రాచీన గాథలను వర్గించే గ్రంథం
– శబ్ద కల్పద్రుమం: పురాభవమితీ పురాణమ్
– బ్రహ్మాండపురాణం: పురాతన వస్తు కల్పకము
– భవిష్య పురాణము: పురానపినవమ్ పురాణమ్మ
– పింగళి లక్ష్మీకాంతం: అలౌకికములు, అద్భుతములైన భవల్లీలా కథనములతో నిండినది పురాణం.
– జి.వి.సుబ్రహ్మణ్యం: ”పంచ లక్షణ విశిష్టములైన పురాణాలు… వేద శాస్త్రేతిహాసాదులతో తమ ప్రత్యేకతను నిలుపుకొనినవి’.
– వేల్చేరు నారాయణరావు: పురాణ మార్గం కథన మార్గం
– అమరసింహుడు : ‘పురాణం పంచలక్షణమ్’
వేదాలను అపౌరుషేమాలనీ, పురాణాలను ఆర్షప్రోక్తాలని చెప్తారు. సంస్కృతంలో ఇవిగాక 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయి. నారదీయ, సనత్కుయారీయ…మొదలైనవి.
పురాణాలు ప్రత్యేకతలు
గరుడ, ఆగేయ, నారదీయ – విజ్ఞాన సర్వస్వాలలాంటివి
పద్మ, స్కాంద, భవిష్య, బ్రహ్మ – తీర్థ, వ్రత, మహాత్మ్యాలను వర్ణించేవి.
బ్రహ్మాండ, వాము – చారిత్రకాంశాలు ఎక్కువ
లింగ, వామన, మార్కండేయ – మత ప్రాధాన్యత గలవి
‘తెలుగులో ప్రథమాంధ్ర సతంత్ర దేశి పురాణం జీవి సుబ్రహ్మణ్యం’ పాల్కురికి సోమన రచించిన ‘బసవపురాణం’. దీనిని సోమన గాన యోగ్యమైన ద్విపద ఛందస్సులో రచించాడు. తిక్కన సాక్షాత్ శిష్యుడు మారన(13శ) చంపూ పద్ధతి(పద్య, గద్య సంకలనం)లో రాసిన ‘మార్కండేయ పురాణం’యే తెలుగులో ‘ప్రథమాంధ్ర మహాపురాణం’ అని నాగయగన్న మంత్రికి అంకితం ఇచ్చెను. మారన మార్గాన్ని అనుసరించి తెలుగులో పురాణాలు రాసిన వారు మడిగి సింగన (పద్మ పురాణోత్తర ఖండం), పిల్లలమర్రి పినవీరభద్రుడు (నారదీయం), నందిమల్లయ, ఘంటసింగనలు (వరాహపురాణం), వెన్నెలకంటి సూరన(విష్ణుపురాణం).
భక్తి, పురాణ కవితలకు పోతన భాగవతమే గొప్ప నిదర్శనం. పోతనామాత్యుడు రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవత పురాణమే తెలుగులో ఏకైక సమగ్ర మహాపురాణం.
తెలుగులో పురాణ గ్రంథాలు గ్రంథకర్తలు
1. నృసిహపురాణం – ఎర్రన
(అహౌబిల నరసింహ స్వామికి అంకితం)
2. భీమ్‌శ్వరపురాణం – శ్రీనాధుడు
(బెండపూడి అన్నమకు అంకితం)
3. గరుడ పురాణం – పింగళి సూరన
4. మత్స్యపురాణం – లింగమగుంట రామకవి
5. వామనపురాణం – ఎలకూచి బాలసరస్వతి
6. బ్రహ్మాండ, బ్రహ్మపురాణాలు – జనమంచి శేషాద్రిశర్మ
7. శివపురాణం – ముదిగొండ నాగవీరేశ్వరశాస్త్రి
8. భాగవతీపురాణం – శ్రీపాద కృష్ణమూర్తి
9. సూతపురాణం – త్రిపురనేని రామస్వామి చౌదరి
(హేమవాద దృష్టితో)
10. పద్మపురాణం – కామినేని మల్లారెడ్డి
11. బాలభాగవతం – దోనూరి కోనేరు నాథుడు
13. దేవాంగపురాణం – భద్రకవి లింగన
14. మార్కండేయపురాణం – ఎల్లకర నృసింహకవి
(వచనంలో)
15. వైశ్యపురాణం – భాస్కరాచార్యుడు
16. దేవి భాగవతం – అనువాదం చేసిన వారు.
(మంత్ర, శాస్త్ర రహస్యాలకు, తిరుపతి వేంకట కవులు
దేవి ఉపాసనకు ప్రసిద్ధి) దాసు శ్రీరాములు
చేతవోలు రామబ్రహ్మం
17. ఆంధ్ర భవిష్యపురాణం – శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి
18. గర్గ భాగవతం – చివుకుల అప్పయ్య శాస్త్రి
19. 1.పురాణవాజ్మయం – విమర్శక/పరిశోధక గ్రంథాలకర్త
2.ప్రథమాంధ్ర మహాపురాణం జి.వి.సుబ్రహ్మణ్యం.
సాధన ప్రశ్నలు
1. తెలుగులో తొలి క్షేత్రమహాత్మ్య కావ్యం?
ఎ. భీమేశ్వర పురాణం బి.కాశీఖండం సి. నృసింహ పురాణం డి. పాండు రంగమహత్యం సి
2. తెలుగులో మొదటి పద్య రామాయణం?
ఎ. రంగనాథ రామాయణం బి. భాస్కర రామాయణం
సి. మొల్ల రామాయణం డి. రామాభ్యుదయం బి
3. భాస్కర రామాయణ కవులలో ఒకరు?
ఎ.గోన బుద్ధారెడ్డి బి.వెలిగందల నారయ
సి. కుమార రుద్రదేవుడు డి. కాచవిభుడు సి
4. రామాయణంలోని విభాగాలను ఏమంటారు?
ఎ. స్కంధ బి.పర్వం సి.కాండం డి.పరిచ్ఛేదం సి
5. ఉత్తర రామాయణం రాసిన కవి?
ఎ. తిక్కన బి.గోనబుద్ధారెడ్డి సి.భాస్కరుడు డి. పింగళి సూరన ఎ
6. తెలుగులో ప్రథమాంధ్ర స్వతంత్ర దేశి పురాణం ఏది?
ఎ. విష్ణు పురాణం బి. బసవపురాణం
సి. భీమేశ్వర పురాణం డి. నృసింహపురాణం బి
7. క్రింది వానిలో రామాయణాన్ని రచించని వారు?
ఎ. తిక్కన బి.భాస్కరుడు సి.శ్రీనాథుడు డి. ఎర్రన సి
8. గరుడు పురాణాన్ని తెలుగులోకి అనుసృజన చేసిన కవి?
ఎ. మడిగి సింగన బి. వెన్నలకంటి సూరన
సి. పింగళి లక్ష్మీకాంతం డి. పింగళి సూరన డి
9. తెలుగు పురాణ సాహిత్యంలో కవీత్రంయం వంటివారు?
ఎ. పాల్కురికి సోమనాథుడు బి. మారన
సి. బమ్మెర పోతన డి. పైవారందరు డి
10. సంస్కృతంలో అష్టాదశ మహాపురాణాలు ఎవరు రచించారు?
ఎ. వాల్మీకి మహర్షి సి. వ్యాసుడు
సి. కాళిదాసు డి. నన్నయ బి
11. ఈ క్రింది వానిలో ఇతిహాసాలు?
ఎ. భాగవతం, భారతం బి. రామాయణం, భాగవతం
సి. నారదీయం, భాగవతం డి. రామాయణం, భారతం డి
12. నన్నయ ఆంధ్రమహాభారతంలో ఎంత వరకు రచించాడు?
ఎ. ఆదిపర్వం, అరణ్యపర్వం, సభాపర్వంలో తృతీయశ్వాసం వరకు
బి. ఆది, సభా, అరణ్య పర్వంలో చతుర్థాశ్వాసంలో 142వ పద్యం వరకు.
సి. ఆది, సభా, అరణ్య పర్వాలు
డి. 18 పర్వాలు రాశాడు బి
13. కవిత్రయంలో పద్దెనిమిది పర్వాల మహాభారతాధ్రీకరణ ఎక్కువ భాగం రచించింది?
ఎ. నన్నయ బి.తిక్కన సి. ఎర్రన డి. పాల్కురికి సోమన బి
14. శ్రీ మదాంధ్ర మహాభాగవతంలో ఎన్ని స్కంధాలున్నాయి?
ఎ. 18 బి.11 సి.12 డి.7 సి
15. ఆంధ్రమహాభారతం..?
ఎ. శాస్త్రీతిహాసం బి.కావ్వేతిహాసం సి. ఇతిహాసం డి.పురాణం బి
16.జతపరుచుము:
1. రామాయణం అ.పర్వం
2. భారతం ఆ. స్కంధో
3. భాగవతం ఇ. కల్పం
4. వేదాంగం ఈ. కాండం
1 2 3 4
ఎ. ఈ అ ఆ ఇ
ఈ ఆ అ ఇ
ఇ ఈ ఆ అ
ఈ ఇ అ ఆ ఎ
తెలుగులో వచ్చిన రామాయణాలు
గ్రంథం గ్రంథకర్త
1. రంగనాథరామాయణం – గోనబుద్ధారెడ్డి (ద్విపదలో రాశాడు)
(తొలి తెలుగు రామాయణం)
2. భాస్కర రామాయణం – బహుకర్తృకం (హుళక్కి భాస్కరుడు, (కృతిపతి: సాహిని మారన) మల్లికార్జునభట్టు, కుమార రుద్ర దేవుడు, అయ్యలార్యుడు) దీనిని ‘చంపూ’ పద్ధతిలో రాశారు.
3. నిర్వచనోత్తర రామాయణం – తిక్కన (తొలి రచనం) – మనుమసిద్ధకి అంకితమిచ్చాడు
(కేవలం పద్యంలో రాశాడు) (ఎర్రన రామాయణం రాశాడు, కాని అలభ్యం)
4. మొల్ల రామాయణం – మొల్ల(15వ శ.) శ్రీకంఠ మల్లేశ్వరుని దయ వల్ల (ఆరు కాండల సంక్షిప్త రామాయణం) కవిత్వం చెప్పిందట. ఇది శ్రీరామ చంద్రునికే అంకితమిచ్చింది.
5. ఉత్తర రామాయణం – ‘కంకంటి పాపరాజు’ దీనిని మదన గోపాల స్వామికి అంకితమిచ్చాడు.
6. ‘రామభ్యుదయం’ – అయ్యలరాజు రామభద్రకవి
7. అచ్చ తెలుగు రామాయణం – కూచిమంచి తిమ్మకవి కుక్కుటేశ్వర స్వామికి అంకితం చేశాడు.
8. శ్రీమద్రామాయణ కల్పవృక్షం – విశ్వనాథ సత్యనారాయణ
ఈ రచనకే 1970లో తొలి తెలుగు జ్ఞానపీఠ్
అవార్డు లభించింది.
9. జనప్రియ రామాయణం – పుట్టపర్తి నారాయణాచార్యులు
10. ఆంధ్ర వాల్మీకి రామాయణం – వావిలికొలను సబ్బారావు
11. రామాయణం, భారతం, భాగవతం – శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి
(మూడింటిని రాసిన ఆధునిక కవి)
12. చంపూ రామాయణం, చంపూ భారతం – అల్లంరాజు రంగరాజు
13. ‘వచన రామాయణాలు’ – చెలమచర్ల రంగాచార్యులు, ఉషశ్రీ.
14. రామాయణ, భారత, భాగవతాలను – డా|| దాశరధి రంగాచార్యులు
సరళ వచనంలో రాసిన ఆధునిక కవి
నానాపురం నర్సింహులు
9030057994