(గతవారం తరువాయి)
పురాపినవమ్ ఇతి పురాణం. ‘పాతదైనా కొత్తగా ఉండేది పురాణం’ అని అర్థం. వేదాలలోని కథలను పెంపొందించి ఉపాభ్యానాలతో నీతిబోధకంగా లోకవృత్తం ప్రతిబింబించేటట్లు రచించడం సాధారణంగా పురాణ పద్ధతి. ప్రాశ్చాత్యులు ఈ పురాణ వాజ్ఞయాన్ని ‘మైథాలజి’ అని పిలిచారు. ‘అమరకోశం’ గ్రంథకర్త అమర సింహుడు. పురాణం ‘సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్యంతరం, వంశాను చరిత్రం’ అనే ఐదు లక్షణాలతో కూడుకొని ఉంటుందని లక్షణం చెప్పారు. సంస్కృతంలో 18 పురాణాలను వ్యాసుడు రచించాడని ప్రతీతి. అవి: 1. మార్కండేయ 2. మత్స్య 3. భవిష్య 4. భాగవత 5. బ్రహ్మ 6. బ్రహ్మాండ 7. బ్రహ్మవైవర్త 8. విష్ణు 9. వాయు(శివ) 10. వరాహ 11. వామన 12. అగ్ని 13. నారద 14. పద్మ 15. లింగ 16. గరుడ 17. కూర్మ 18. స్కంద పురాణాలు.
పురాణం నిర్వచనాలు
అధర్వణ వేదం: ప్రాచీన కథ లేదా పూర్వకథ
శతపథ బ్రాహ్మణం: ప్రాచీన గాథలను వర్గించే గ్రంథం
శబ్ద కల్పద్రుమం: పురాభవమితీ పురాణమ్
బ్రహ్మాండపురాణం: పురాతన వస్తు కల్పకము
భవిష్య పురాణము: పురానపినవమ్ పురాణమ్మ
పింగళి లక్ష్మీకాంతం: అలౌకికములు, అద్భుతములైన భవల్లీలా కథనములతో నిండినది పురాణం.
జి.వి.సుబ్రహ్మణ్యం: ”పంచ లక్షణ విశిష్టములైన పురాణాలు… వేద శాస్త్రేతిహాసాదులతో తమ ప్రత్యేకతను నిలుపుకొనినవి’.
వేల్చేరు నారాయణరావు: పురాణ మార్గం కథన మార్గం
అమరసింహుడు : ‘పురాణం పంచలక్షణమ్’
వేదాలను అపౌరుషేమాలనీ, పురాణాలను ఆర్షప్రోక్తాలని చెప్తారు. సంస్కృతంలో ఇవిగాక 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయి. నారదీయ, సనత్కుయారీయ…మొదలైనవి.
‘తెలుగులో సతంత్ర దేశి పురాణం పాల్కురికి సోమన రచించిన ‘బసవపురాణం’. దీనిని సోమన గాన యోగ్యమైన ద్విపద ఛందస్సులో రచించాడు. తిక్కన సాక్షాత్ శిష్యుడు మారన(13శ) చంపూ పద్ధతి(పద్య, గద్య సంకలనం)లో రాసిన ‘మార్కండేయ పురాణం’యే తెలుగులో ‘ప్రథమాంధ్ర మహాపురాణం’ అని జీవి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. మారన ఈ పురాణాన్ని నాగయగన్న మంత్రికి అంకితం ఇచ్చెను. మారన మార్గాన్ని అనుసరించి తెలుగులో పురాణాలు రాసిన వారు మడిగి సింగన (పద్మ పురాణోత్తర ఖండం), పిల్లలమర్రి పినవీరభద్రుడు (నారదీయం), నందిమల్లయ, ఘంటసింగనలు (వరాహపురాణం), వెన్నెలకంటి సూరన(విష్ణుపురాణం).
భక్తి, పురాణ కవితలకు పోతన భాగవతమే గొప్ప నిదర్శనం. పోతనామాత్యుడు రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవత పురాణమే తెలుగులో ఏకైక సమగ్ర మహాపురాణం.
తెలుగులో పురాణ గ్రంథాలు గ్రంథకర్తలు
1. నృసిహపురాణం – ఎర్రన
(అహౌబిల నరసింహ స్వామికి అంకితం)
2. భీమేశ్వరపురాణం – శ్రీనాధుడు
(బెండపూడి అన్నమకు అంకితం)
3. గరుడ పురాణం – పింగళి సూరన
4. మత్స్యపురాణం – లింగమగుంట రామకవి
5. వామనపురాణం – ఎలకూచి బాలసరస్వతి
6. బ్రహ్మాండ, బ్రహ్మపురాణాలు – జనమంచి శేషాద్రిశర్మ
7. శివపురాణం – ముదిగొండ నాగవీరేశ్వరశాస్త్రి
8. భాగవతీపురాణం – శ్రీపాద కృష్ణమూర్తి
9. సూతపురాణం – త్రిపురనేని రామస్వామి చౌదరి
(హేమవాద దృష్టితో)
10. ఆంధ్రపురాణం – మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి
11. పద్మపురాణం – కామినేని మల్లారెడ్డి
12. బాలభాగవతం – దోనూరి కోనేరు నాథుడు
13. దేవాంగపురాణం – భద్రకవి లింగన
14. మార్కండేయపురాణం – ఎల్లకర నృసింహకవి(వచనంలో)
15. వైశ్యపురాణం – భాస్కరాచార్యుడు
16. దేవి భాగవతం – అనువాదం చేసిన వారు.
తిరుపతి వేంకట కవులు, దాసు శ్రీరాములు, చేతవోలు రామబ్రహ్మం
(మంత్ర, శాస్త్ర రహస్యాలకు, దేవి ఉపాసనకు ప్రసిద్ధి) 17. ఆంధ్ర భవిష్యపురాణం – శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి
18. గర్గ భాగవతం – చివుకుల అప్పయ్య శాస్త్రి
19. 1. పురాణవాజ్మయం – విమర్శక/పరిశోధక గ్రంథాలకర్త
2. ప్రథమాంధ్ర మహాపురాణం జి.వి.సుబ్రహ్మణ్యం.
నానాపురం నర్సింహులు
9030057994