బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్నను ప్రకటించిన ఎప్సన్ ఇండియా

– స్థిరమైన, పొదుపైన ముద్రణకు జపనీస్ బ్రాండ్ యొక్క నిబద్ధతను రష్మిక హైలైట్ చేస్తుంది.
డిజిటల్ మరియు ప్రింటింగ్ సొల్యూషన్స్‌లో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న ఎప్సన్, ప్రముఖ భారతీయ సినీ నటి రష్మిక మందన్నను భారతదేశంలో తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని నేడు ప్రకటించింది. ప్రజాదరణ కలిగిన ఈ ప్రఖ్యాత నటి భారతదేశంలో ఎప్సన్ ఉత్పత్తులకు ప్రచారం చేసేందుకు ఆమె సహకరించనున్నారు. జూన్‌లో ఎప్సన్ ఎకోట్యాంక్ ప్రింటర్స్ కోసం రూపొందించిన మల్టీ-మీడియా క్యాంపెయిన్‌లో ఆమె మొదటిగా కనిపించనున్నారు. అత్యంత విజయవంతమైన ఎప్సన్ ఎకో ట్యాంక్ ప్రింటర్ల ఆర్థిక, పర్యావరణ అనుకూల ప్రయోజనాలపై క్యాంపెయిన్ దృష్టి సారిస్తోంది. కన్నడ, తెలుగు, హిందీ మరియు తమిళ సినిమాల్లో తన నటనతో గుర్తింపు దక్కించుకున్న బహుముఖ నటి రష్మికతో కలిసి, దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రజలను, ముఖ్యంగా యువతను చేరుకునేందుకు, మరింత ప్రజాదరణ దక్కించుకోవాలని ఎప్సన్ భావిస్తోంది. ఎప్సన్ ఇండియాతో తన అనుబంధం గురించి రష్మిక మాట్లాడుతూ, ‘‘ఎప్సన్ ఇండియాతో అనుబంధం కలిగి ఉండటం, వారు అందిస్తున్న స్థిరమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రింటింగ్ పరిష్కారాలను ప్రోత్సహించేందుకు నేను సంతోషిస్తున్నాను. ఎప్సన్ ఎకో ట్యాంక్ ప్రింటర్లు అద్భుతమైనవి మరియు విప్లవాత్మకమైనవి కాగా, వాటిలో హీట్ ఫ్రీ టెక్నాలజీ ఉపయోగించారు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు నేను ఉత్సాహంగా మరియు ఆసక్తిగా ఉన్నాను’’ అని తెలిపారు.
ఎప్సన్ ఇండియా బ్రాండ్ & కమ్యూనికేషన్ డైరెక్టర్ తుషాద్ తలతి మాట్లాడుతూ, ‘‘రష్మిక మందన్న మా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ క్యాంపెయిన్ ద్వారా ఎప్సన్ ఎకోట్యాంక్ ప్రింటర్లలోని అద్భుతమైన హీట్-ఫ్రీ టెక్నాలజీ, పర్యావరణ అనుకూలమైన మరియు ఆర్థికపరమైన ముద్రణ ప్రయోజనాలపై ఎక్కువ మంది వినియోగదారులకు అవగాహన కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఎప్సన్ ఉత్పత్తులు, జీవితాలను సుసంపన్నం మరియు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడంలో సహాయపడే ఉద్దేశపూర్వక విలువను ఎలా అందజేస్తాయో తెలియజేసేందుకు ఈ భాగస్వామ్యం మాకు సహాయం చేస్తుంది’’ అని ధీమావ్యక్తం చేశారు. ఎప్సన్ ఎకో ట్యాంక్ ప్రింటర్లు హీట్ ఫ్రీ టెక్నాలజీని వినియోగించుకుంటాయి. ఇది తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. తక్కువ ఇ-వ్యర్థాలను వెలువరిస్తుంది మరియు ప్రింటింగ్ ఖర్చులను ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఈ సాంకేతికత సమర్థవంతమైన, కాంపాక్ట్ మరియు కచ్చితమైన ఆవిష్కరణల ఎప్సన్ ఫిలాసఫీని కలిగి ఉంటుంది.