నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న సోమవారం కాంగ్రెస్‌లో చేశారు. మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో సోమవారం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపూరి సోమన్న షర్మిల స్థాపించిన వైఎస్‌ఆర్‌టీపీలో చేరి.. తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగి తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏపూరి సోమన్నకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.